
అరుణ కిరణ ఉదయంతో నా రుధిర కాంతి మెరవాలి
నా ఊహల విరితోటలో వర్ష ధార కురవాలి
సకల కళా సమ్మేళన భూతల వేధికపై శాంతికోరు వైతాళిక గేయం నే కావాలి
నా జాతి పదిల పరుచుకున్న అజరామర పీటికలో
ఆది పలుకులన్నీ నా ఘంటమే రాయాలి
శ్రావణమాస మయూరమై నా అమ్మ ప్రేమ మురవాలి
అంబరానికెగసే నా ఆశల రెక్కలకు ఆ సాంతం సహకారం
ఈ ఉదయం కావాలి......................వేణు మాదల !

No comments:
Post a Comment